Stock Market Roundup 08-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో నష్టాల నుంచి కోలుకుంది. రెండు కీలక సూచీలకు లాభాలతో శుభం కార్డు పడటం వరుసగా ఇది మూడో రోజు. మార్నింగ్ ట్రేడింగ్‌లో 60 వేల కన్నా దిగువకు వచ్చిన సెన్సెక్స్ ఎట్టకేలకు బెంచ్ మార్క్‌ను దాటింది. చివరికి.. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 60 వేల 348 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.