పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనికి కారణం కరోనా. మన తెలుగు సినిమాకు పక్క రాష్ర్టాల్లో కూడా చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలో పలు చోట్ల రిలీజ్ అవుతుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెలుగు…