కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిమితులను పూర్తిగా ఎత్తేశాయి ప్రభుత్వాలు. ఇక లాక్డౌన్ కారణంగా విడుదలలు వాయిదా వేసుకున్న ఎన్నో చిత్రాల నిర్మాతలు థియేటర్ల రీఓపెన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే విడుదలవ్వడానికి పలు భారీ సినిమాలు కాచుకుని కూర్చున్నాయి. Read…
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ముగిసిన థియేటర్ల ఓపెనింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు అవుతుండగా.. విడుదలకు రెడీగా వున్నా సినిమాలు థియేటర్లపై దూకేందుకు వెనకడుగు వేస్తున్నాయి. విడుదల తేదీలను సైతం ప్రకటించేందుకు సిద్దపడట్లేదు. తెలంగాణలో తెరలు తెరిచేందుకు పర్మిషన్ ఉండగా.. ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే జులై లోనైనా పరిస్థితులు మారుతాయని అనుకొనే…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం భారీగానే పడింది. దీని కారణంగానే థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్…