కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో సహజంగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారు. అయితే కొందరు తమలోని పేషన్ ను విస్త్రత పరిధిలో ప్రేక్షకులకు చేర్చాలనే భావనతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిందే ‘ది రోజ్ విల్లా’ మూవీ. డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), అతని భార్య, రచయిత్రి శ్వేత…