సైలెంట్ గా వచ్చి కోట్లు కొల్లగొట్టిన చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”. అదే లెవెల్లో విమర్శలూ ఎదుర్కొంది ఈ మూవీ. అంతేనా సినిమా గురించి ఢిల్లీ రాజకీయాల్లోనూ గట్టి చర్చే జరిగింది. ఏకంగా ప్రధాన మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలూ తప్పలేదు. ఏదైతేనేం సినిమా ప్రేక్షకులకు నచ్చింది. కలెక్షన్లూ భారీగానే రాబట్టింది. అటు దర్శకుడికి మంచి పేరు, ఇటు నిర్మాతలకు అద్భుతమైన లాభాలూ వచ్చాయి. తాజాగా “ది కాశ్మీర్…
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “ది కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు.. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయన్నారు.. అయినా, నీకు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు నచ్చుతాయి.. దోపిడీ దొంగలు లాంటి సినిమాలు నచ్చుతాయన్నారు.…
దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్‌లో…
The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం…
Prakash Raj తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా…
చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ…
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్‌లపై…
The Kashmir Files Movie Unit Meet Union Minister Amit Shah Today. వివేక్ రంజన్ అగ్రిహోత్రి తెరకెక్కించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి సంబంధించిన చర్చే ఇవాళ సోషల్ మీడియాలో అత్యధికంగా జరుగుతోంది. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీని ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏమంటే… 1990లో కశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలపై విచారణ జరిపించాలని అప్పటి సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు…