చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండ చూడాలంటూ కోరుతున్నారు.
ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని సాధువులు సైతం థియేటర్ కి వెళ్లి చూసిన సంగతి తెలిసిందే. ఇంత ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా ఓటిటీలోకి ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నదట.. ముందు అనుకున్నట్లు గానే సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటిటీ లో స్ట్రీమింగ్ చేద్దామని అనుకున్నారట మేకర్స్.. కానీ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఓటిటీ డేట్ ని వాయిదా వేశారని మరో నాలుగు వారలు ఈ సినిమాను డిజిటల్ చేయవద్దని జీ5 ని కోరారట మేకర్స్.. దీంతో ఈ చిత్రం మే 6 న ఓటిటీ లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.