Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమాతో తలైవా భారీగా కలెక్షన్స్ కూడా అందుకున్నారు.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజిని వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.జై భీం దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ లో తలైవా నటిస్తున్న వేట్టయాన్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం రజిని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్…
రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకొని వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ఒకరోజు ముందు రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక యాత్ర లో భాగంగా ఆయన రిషికేష్, బద్రీనాథ్,ద్వారక మరియు బాబాజీ కేవ్ ను సందర్శించనున్నారు.రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఒక వారం పాటు సాగనుంది సమాచారం. రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర గురించి ముందుగానే తెలుసుకున్న వీరాభిమాని ఆయన్ని…
తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది.…
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఇన్ని నెలల తరువాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ “మక్కల్ మండ్రం” భవిష్యత్ గురించి తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాబట్టి రజినీ “మక్కల్ మండ్రం” ఇకపై పని…
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాకకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 19న తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. Read Also : ‘భాయ్ జాన్’పై బిజినెస్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో యూఎస్ లో ఉన్నారు. యూఎస్ లోని వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఆయన అభిమానులతో దిగిన తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో రజినీకాంత్ నీలిరంగు చొక్కా. బూడిద రంగు ప్యాంటు ధరించి కన్పిస్తున్నారు. జూన్ 19న రజినీకాంత్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. యూఎస్ లోని మాయో క్లినిక్‌లో తన సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 2016లో…
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా యూఎస్ లో కన్పించగా క్లిక్ మని అనిపించిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఈ పిక్ లో ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్ లోని మాయో క్లినిక్‌లో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 19న రజినీ తన భార్య లతతో కలిసి రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన విషయం విదితమే. ఆయన 2016లో అక్కడే కిడ్నీ…
తలైవా రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం ఈరోజు ఉదయం అమెరికా బయలుదేరారు. మే 2016లో రజినికి మూత్రపిండాల వ్యాధి కారణంగా… అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో నిపుణుల బృందం కిడ్నీ మార్పిడి చేశారు. తరువాత నుంచి ఆయన యునైటెడ్ స్టేట్స్ లోని అదే ఆసుపత్రిలో వార్షిక వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా రజినీ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళలేకపోయారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో రజినీకాంత్ అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు.…