తలైవా రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం ఈరోజు ఉదయం అమెరికా బయలుదేరారు. మే 2016లో రజినికి మూత్రపిండాల వ్యాధి కారణంగా… అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో నిపుణుల బృందం కిడ్నీ మార్పిడి చేశారు. తరువాత నుంచి ఆయన యునైటెడ్ స్టేట్స్ లోని అదే ఆసుపత్రిలో వార్షిక వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా రజినీ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళలేకపోయారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో రజినీకాంత్ అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు.
Also Read : లవ్ లో పడ్డానంటున్న హీరోయిన్
ఈ నేపథ్యంలో రజిని ఈ రోజు (జూన్ 19) ఉదయం అమెరికా బయలుదేరారు. ఖతార్ ఎయిర్లైన్స్ ద్వారా చెన్నై నుండి దోహా వరకు, అక్కడి నుండి మరొక విమానం ద్వారా అమెరికాకు చేరుకోనున్నారు. ఆయనతో పాటు భార్య లతా రజనీకాంత్ కూడా ఉన్నారు. రోజినెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో రజనీకాంత్ రొటీన్ మెడికల్ చెకప్ చేయించుకోనున్నారు. అమెరికాలో రజినీకాంత్ ను అతని కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్, మనవరాళ్లు కలవనున్నారు. ‘ది గ్రే మ్యాన్’ చిత్రీకరణ కోసం ఇప్పటికే అమెరికా వెళ్లిన ధనుష్ కరోనా వ్యాప్తి కారణంగా అక్కడే ఉన్నాడు. చెకప్ తరువాత మూడు వారాల పాటు యుఎస్‌లో ఉండి, వారంతా రజినితో కలిసి చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం.