జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్ లో ప్రదర్శించగా, అక్కడ అద్భుతమైన స్పందన వస్తోందని సమాచారం.
Read Also : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
Also Read
ఈ చిత్రం జపనీస్ వెర్షన్ ఇటీవల జపాన్ లోని ఎంకేసి ప్లెక్స్‌లో విడుదలైంది. ఈ నెల 21 వరకు అక్కడి థియేటర్లలో ‘దర్భార్’ తుఫాన్ కొనసాగుతుంది. ‘దర్బార్’లో రజినీకాంత్ తో పాటు నయనతార, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం రజినీకాంత్ “అన్నాత్తే” సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి “అన్నాత్తే” ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!