గ్రూప్-2 పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది టీజీపీఎస్సీ. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షా ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
హైదరాబాద్ TGPSC ముందు ఉద్రిక్తత నెలకుంది. TGPSC వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే జాబ్ క్యాలెండరు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేసారు. ప్రస్తుతం పోలీసులు వారిని అడ్డుకుని ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. మరిన్ని వివరాల కోసం కింద వీడియో చుడండి..
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తు లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది.
Group-1 Prelims Key: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని గురువారం (జూన్ 13) విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది.
ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ - I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.