Telangana BJP: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: నేడు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తోందని ఆపార్టీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. కాగా.. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తుల పై చర్యలు తీసుకోవడం లేదని నేతలు విమర్శించారు. బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు.
Read also: ACB Raids: హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు.. అదుపులో ఆ.. నలుగురు..!
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ తీరు నీరు కార్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి తప్పుదోవ పట్టించే విధంగా చూస్తున్నాయని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకి వెల్లవడుతున్నాయి. ఏకంగా 1200 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో జడ్జిలు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, వ్యాపార వేత్తలు ఉన్నారని స్పష్టం చేశాడు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టమ్ ల ద్వారా ట్యాపింగ్ చేశామని ప్రణీత్ వాంగ్మూలం ఇచ్చాడు.
Remal Cyclone : అస్సాంలో ‘రెమాల్’ తుఫాను..ఐదుగురు మృతి.. 42 వేల మందిపై ప్రభావం
తాజావార్తలు
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!