తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పిసిసి కమిటీ, కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది. PCC కమిటీలో పెద్దగా పోటీ దారులు ఉండకపోవచ్చు గానీ.... కేబినెట్ విషయంలో మాత్రం ఆశావాహులు ఎక్కువ. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ, అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట.
తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గుర్తించిందో ..లేదో గానీ... కార్యకర్తలకు,స్థానిక నేతలకు మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. రాను రాను అది బాగా పెరిగిపోతోందని, వెంటనే సెట్ చేయకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పుకుంటున్నారు. ఈ జిగ్‌జాగ్ సిస్టంని సెట్ చేయాల్సిన బాధ్యత అయితే... రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీద ఉందని, కానీ... ఆమె ఆ పనిలో ఉన్నారో లేదో అర్ధం కావడం లేదని పార్టీ వర్గాలో మాట్లాడుకుంటున్న…
కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్‌కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..? అని దుయ్యబట్టారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.