ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది.
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండగా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన…