తెలంగాణ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది.
ఏపీ సర్కార్ మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు..