Tesla: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా సిద్ధమైంది. ప్రతిపాదిత 2-3 బిలియన్ డాలర్లతో దేశంలో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందు కోసం దేశంలోని పలు ప్రాంతాలను టెస్లా బృందం అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.