Tesla Jobs: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు మరింత వేగాన్ని పెంచింది. త్వరలోనే ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమవుతోంది. ఇందుకు సంకేతంగా కంపెనీ ఇప్పటికే ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. రీసెంట్‌గా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాలో కలుసుకున్నారు. ఆ సమావేశం తర్వాతే టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇండియాలో…