అమెరికాకు చెందిన స్పేస్ X సంస్థ అంతరిక్ష యాత్రలో మరో ఘనత సాధించింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోకి స్పేస్ X సంస్థ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరు 10రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. ఐఎస్ఎస్‌కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. అయితే స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందినది…