భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము సపోర్టు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. అయితే, చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
Jaishankar: ఉగ్రవాదం పట్ల భారత్‌కి సహనం తక్కువ అని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది.
USA: పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది.
ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్‌పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు.
Pakistan: ఉగ్రవాదులపై రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదుల్ని వదలేది లేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, అక్కడికి వెల్లి వారిని చంపేస్తామని అన్నారు.
పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు
పాకిస్తాన్‌తో మాట్లాడటానికి భారతదేశం ఎప్పుడూ తలుపులు మూసుకోలేదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే, ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన చర్చలు జరిపితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు.
Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు.