IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా…