Karnataka High Court: అత్యాచార బాధితురాలు గర్భంతో ఉంటే, 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బాధితులకు ఆయా పరిధిలోని పోలీసులు చెప్పాలని కర్ణాటక హైకోర్టు దిశానిర్దేశం చేసింది. దీని వల్ల బాధితులు సమయం దాటాక కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, నేర ఫలితంగా గర్భం దాల్చింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో…
మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది.