ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు... గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు..