రథాన్ని విద్యుత్ తీగలు తగలడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో ఇటీవల రాములోరి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం స్వామి వారి ఊరేగింపు చేసే రథం ఆలయ సమీపంలో ఉండగా.. ఆ రథాన్ని ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పైన విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో…