కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలను బ్యాలెన్స్ చేసే విధంగా వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మూడు పార్టీలకు న్యాయం చేసే విధంగా ఈ నియామకాలు చేపడుతూ వచ్చారు.. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది కూటమి ప్రభుత్వం..