దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై…
India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.
అక్కినేని నాగచైతన్య ఎంగేజ్ మెంట్ ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో జరగనుంది. నాగచైతన్య త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు అక్కినేని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన సినీ కెరిరీ లో మెుదటి హిట్ సినిమా ఏమాయ చేసావేలో చైతన్యకు జోడిగా నటించిన సమంతతో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాని ఆ బంధం ఎక్కువ కాలం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్ చేయించారు. గత ప్రభుత్వం గేట్-2 మూసేసి నిర్మించిన గోడను పడగొట్టించి గేట్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు…
రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం. కాగా…
AP CM Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు.