AP CM Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Read also: HBD MS DHONI : 100 అడుగుల అభిమానం.. ధోని కట్ అవుట్ మాములుగా లేదుగా..
పాతనగరం పురానా పూల్ ప్రాంతానికి చెందిన మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీలో కొనసాగుతున్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకా చాలా మంది నేతలు టీడీపీలోనే ఉన్నారు. ఇవాళ జరిగే ముఖ్యమైన సమావేశానికి వీరంతా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఇన్‌చార్జులతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కూడా చర్చిస్తారని చెబుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు ముందుగా యాక్టివ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.
Read also: Anakapalli: 9వ తరగతి విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య..
ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల వారీగా పాత నేతల జాబితాను ట్రస్టు భవన్ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. టీ టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీలో నామినేటెడ్ పదవులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించవచ్చని సమాచారం. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కవచ్చని టీ టీడీపీ నేతలు చెబుతున్నారు. మరికొందరికి ఈసారి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో తెలంగాణకు ఎన్నో పదవులు వచ్చాయి. ఇప్పుడు కూడా టీ టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు లేదా సలహాదారు పదవులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Dalai Lama 89th Birthday: దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ