తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కన్నెత్తి చూసే పార్టీల పతనం ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ని అలెర్ట్ చేసినట్టు చెప్తున్నారని, బీఆర్ఎస్.. బీజేపీ మధ్య ఉన్న అనైతిక రహస్యమైత్రి తెలియదు అనుకోకండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు వెళ్తారు అనే మాటలు చెప్పడం సరికాదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంని కూల్చాలని అనుకుంటే ఇటువైపు నుండి అంతకంటే…
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్నెస్పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా…
వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై వైసీపీ అధిష్ఠానం పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై సీఎం జగన్ చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
వెస్టిండీస్, యూస్ఏలలో జరగబోయే ICC టీ20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కోరాడు. ఈ పిచ్ ల్లో మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని.. కాబట్టి వీరి జోడి మంచిగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్లో చూసినట్లుగా పవర్ప్లే ఓవర్లలో కోహ్లీ…
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు…
అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బ్యారేజీలో సీపేజ్ మరమ్మతు పనులను శనివారం ప్రారంభించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగమైన అన్నారం బ్యారేజీలో అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు గేట్ నంబర్ 38, 28 వద్ద చిన్నపాటి చుక్కలు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు రాయి, మెటల్, ఇసుకతో తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేసి లీకేజీని నియంత్రించి ఇసుక పారకుండా అడ్డుకున్నారు. కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) బృందం నవంబర్ 2న అన్నారం బ్యారేజీని సందర్శించి, మురుగు…
రామగుండం-2 డివిజన్లోని భూగర్భ బొగ్గు గని జీడీకే-2 ఇంక్లైన్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు నూతనంగా నియమితులైన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ శనివారం సందర్శించారు. రామగుండంలోని బొగ్గు గనులను తన తొలి సందర్శన సమయంలో, బలరామ్ ఇతర మైనర్ల మాదిరిగానే హెల్మెట్, బూట్లు మరియు ఇతర భద్రతా గాడ్జెట్లతో కూడిన పూర్తి మైనింగ్ దుస్తులను ధరించి మ్యాన్-రైడర్పై ప్రయాణించి భూగర్భ గనిలోకి వెళ్లారు. బొగ్గు తవ్వకాలతో పాటు కార్మికుల భద్రతా చర్యలను కూడా ఆయన…
ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపు కోవాలని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాలతో పాటు ప్రజలందరికి నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో…
సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్…