`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి…
గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47…
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.
స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు కానీ.. రైతుల్ని పట్టించుకోరా? డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో (Delhi) నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంపై స్పందించారు. రైతులు (Farmers Protest) కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే…
కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని…
పదేండ్లు అధికారంలో ఉండి.. ఆంధ్రా నాయకులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. చేపల పులుసు తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తనని శపథం చేసిన కేసిఆర్.. ఇప్పుడు అధికారం పోగానే గజినిలా గతం మరిచిపోయాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. 2015 లో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇప్పుడు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను…
భారతీయ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడు ఇబ్బందులు పడతారో తెలియదు కాబట్టి... అందుకే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
మేడిగడ్డ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు.…
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ…