నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అయితే.. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్‌ఎంబీకి అప్పగించబోని చెప్పించింది బీఆర్‌ఎస్ అని ఆయన అన్నారు. ఇది బీఆర్‌ఎస్ పార్టీ విజయమని, మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశామని, ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి పిపిటి తప్పుల తడకగా ఉందన్నారు హరీష్ రావు. అధికార ప్రతిపక్షం సమన్యాయం చేయాలి కానీ ఏక పక్షంగా చెప్పారని, మేముకుడా ఫాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియచేయాలన్నారు. మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ అంటే వినడం లేదని, కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మీ మన్మోహన్ గారు అన్నారు కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్ ను తప్పు పట్టారని, ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నదని హరీష్ రావు వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: రేపు విశాఖకు జనసేనాని..
అంతేకాకుండా..’ప్రాణహిత టెండర్లు వేయలేదని పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపి సీట్ల కోసం భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తుంది. రైతుల సంక్షమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. వారి తప్పులు ఎత్తి చుప్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు. స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో వాస్తవాలు దాచి పెట్టారు. ప్రజలకు క్షమాపణ చెప్పవలసింది మీరు. గ్యారెంటీ అమలు చేయలేక మెడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా, ప్రజల్లో అడ్డుకోలేరు.’ అని హరీష్ రావు అన్నారు.
Bhamakalapam 2 : ప్రియమణి ‘ భామా కలాపం మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్..24 గంటల్లోనే..