నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అయితే.. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని చెప్పించింది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని, మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశామని, ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి పిపిటి తప్పుల…
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధికి చిరునామాగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగు శాతం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. మొత్తం 30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది.. గతంలో తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం తక్కువకు పడిపోయిందని తెలిపారు. రావణాసురడి వధ జరిగితేనే రాష్ట్రానికి మేలు…
రేపు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. మరో సభ నిర్వహిస్తోంది. కాగా.. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు.
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అతిపెద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషం అని అన్నారు. మరోసారి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని వైవీ స్పష్టం చేశారు. కోర్టులో చిన్న చిన్న అడ్డంకులు ఉండడం వలన పరిపాలన రాజధానిగా విశాఖ ఆలస్యమైందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నారం…సుందిళ్ల..మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయి కదా అంటున్నారని, అంత సింపుల్ గా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్లని మండిపడ్డారు. సీరియస్ ప్రాబ్లం తీసుకుని.. అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉందా..?అని ఆయన ప్రశ్నించారు. కుంగిన బ్యారేజీల పై నివేదిక తెప్పిస్తామన్నారు. ఎలా పునరుద్దరణ చేయాలి అనేది ఆలోచిస్తామని, మా…
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.
ఇరాన్లో ఓ కొడుకు ఘాతుకం.. తుపాకీ కాల్పుల్లో 12 మంది మృతి ఇరాన్లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య…
రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది.
జుట్టు రాలడం అనేది చాలా మందికి ప్రధాన సమస్య. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. చుండ్రు, ఒత్తిడి మరియు కొంత విటమిన్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. ఖచ్చితమైన కారణాన్ని కనుగొని, పరిష్కారాన్ని కనుగొనడం అవసరం. చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఇంట్లో ప్రయత్నించే హెయిర్ ప్యాక్ ఇక్కడ ఉంది. దీనికి మీకు కావలసిందల్లా ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె మరియు కలబంద. అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాలను కలిగి…