బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలమైంది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు పూర్తిగా విఫలం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా అందులో భాగమేనని తెలిపారు.బీజేపీ కుట్రలకు బయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేనని ప్రకటించారు.చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటాటని స్వేరోలకు హామీ ఇచ్చారు.తనకు అన్ని రకాలుగా ఆది నుంచి సహాయ సహకారులు అందించిన స్వేరోలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన పార్టీ అధినేత్రి కుమారి మాయావతి,పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ లతోపాటు తొడ్పాటునందించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.