రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. నిందితుడు ఈ ఏడాది జనవరిలో చెన్నైలో నివసించినట్లు కూడా గుర్తించారు. నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్‌కు "స్వాగతం" అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. "నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను" అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు.
K.Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ ఇచ్చింది. కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.
ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 26 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు…
మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల మండలం గంగాపురంలో ఆలయ పట్టణం వద్ద 900 ఏళ్ల కన్నడ శాసనం నిర్లక్ష్యానికి గురైంది. గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ పరిసరాలను సందర్శించిన పురావస్తు శాస్త్రవేత్త ఇ శివనాగిరెడ్డి ఈ విషయాన్ని గమనించారు. శాసనం సమీపంలోని ట్యాంక్‌బండ్‌పై పట్టించుకోకుండా పడి ఉండటం గమనించబడింది. శిలాశాసనాన్ని జాగ్రత్తగా చదవడం వలన ఇది జూన్ 8, 1134 CE (శుక్రవారం)న కళ్యాణ చాళుక్య చక్రవర్తి ‘భూలోకమల్ల’ సోమేశ్వర-III కుమారుడు తైలప-III యొక్క కస్టమ్స్ అధికారులు జారీ చేసినట్లు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్…
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడింది.. బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్…