ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని దేశాలు సమయాత్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీని దక్కించుకునేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో.. సాయంత్రం వరకు పూర్తి నామినేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. 268 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. మల్కాజిగిరి ఆర్వో పై మల్కాజ్గిరి పార్లమెంట్ లో నామినేషన్ వేసి తిరస్కరించబడ్డ…
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి శుభ ముహూర్తాలు లేవపోవడమే దీనికి కారణమని వేద పండితులు చెబుతున్నారు. ఇవాళ (ఏప్రిల్ 29) నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవని వెల్లడించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. సన్ రైజర్స్…
జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.
మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్‌లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది... ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి…