CM Revanth Reddy : ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి తెలంగాణ పౌరుషాన్ని చూపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడకు వలస వస్తే తెలంగాణ వాదం కోసం గెలిపించారని, పాలమూరుకు వస్తే మేమూ గెలిపించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు జరిగేవి ఫైనల్స్… సెమీస్ లో కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నిక్కల్లోనూ బిఅరెస్ బీజేపీ లను ఓడించాలని, విభజన హామీలను అమలు చేయని బీజేపీ.. తెలంగాణ ఏర్పాటుని పార్లమెంట్ సాక్షిగా అవహేళ చేసి అవమానించారన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటే బండి సంజయ్ ఏమి చేశారని, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నిజామాబాద్ గుండు, కరీంనగర్ అరగుండు ఏం చేసారన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా..’అయోధ్యలో రాముని కల్యాణం జరగక ముందే అక్షింతలు పంచి రాముణ్ణి అవమానించింది బీజేపీ. మేమంతా హిందువులమే.. శ్రీరాముడు మాకు కూడా దేవుడే… హిందుత్వాన్ని దేవుణ్ణి ఓట్లకోసం మేము వాడము.. గుండు అరగుండు కరీంనగర్ నిజామాబాద్ లలో బస్టాండ్ లో దేవుని బొమ్మ పెట్టుకుని చిల్లర అడుక్కున్నట్టు రాముని బొమ్మతో ఓట్లు అడుక్కుంటున్నారు. బీసీ జనగణకు మేము ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలు చేస్తుంది. బీజీపీ 400 సీట్ల నినాదం వెనక కుట్ర ఉంది.. మూడింట రెండువంతుల సీట్లు పొంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలనుకుంటున్నారో చెప్పాలి. నేను వేదికల మీద మాట్లాడిన మాటలకు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు.. పదేళ్లుగా కేసీఆర్ నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇంటికి పోయాడు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టు ఉంది. బీజేపీ బిఅరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారు. కేసీఆర్ ని ఇండియా కూటమిలోకి రానివ్వం.. కేసీఆర్ ఇంటిమిది కాకి మా ఇంటికి వచ్చిన ఊరుకోము… ఆ కాకిని కాల్చి పడేస్తాం. ఖమ్మంలో మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అయితడు అన్నారు.. అంటే బీజేపీ తో ఫిక్సింగ్ ఉన్నట్టే కదా. రామప్ప దేవుని మీద ఒట్టేసి చెబుతున్న ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని భావిస్తున్నాను..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!