హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఉజ్వల భవిష్యత్ కోసం మీ కమిట్ మెంట్ ఎంతో స్పెషల్ అని, హైదరాబాద్ ఇంకా మరెంతో ప్రత్యేకం.. మరీ ప్రత్యేకంగా ఈ వేదిక ఇంకా ప్రత్యేకమన్నారు. పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను.. ఆ సభకు టికెట్ పెట్టామని, ఈ సభ ఒక టర్నింగ్ పాయింట్ అయిందన్నారు ప్రధాని మోడీ. దేశంలోని నిరాశకు కూడా ఆశ చిగురించిందని, తెలంగాణ ప్రజల మూడ్ ఏంటనేది ఇప్పుడు తెలుస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ను వద్దనుకుంటున్నారని, 4 జూన్ తర్వాత ఏం జరుగుతుందనేది నాకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు నరేంద్ర మోడీ. 4 జూన్ తర్వాత 140 కోట్ల ప్రజలు విజయాన్ని సాధిస్తారు.. భారతదేశ విరోధులు మాత్రం ఓడిపోతారని, సీఏఏ, యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించేవారు, అవినీతిపరులు ఓట్ జిహాద్ అనేవారు ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు.
అంతేకాకుండా..’హైదరాబాద్ సొల్యూషన్ సిటీ. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ దేశం అవినీతి లాంటి సమస్యను అధిగమిస్తుందా? లక్షల కోట్ల స్కామ్ చేసిన పార్టీలను దాటుకుని ముందుకువెళ్తామా? యువతను పట్టించుకోని పార్టీలు దేశ భవిష్యత్ ను మారుస్తాయా? ప్రతి ప్రాజెక్టులో కరెప్షన్ చేసే పార్టీలు.. మోడల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను డెవలప్ చేస్తుందా? ఇవన్నీ మోడీ చేయలేడు.. కానీ ఒక్క మీ ఓటు చేయగలదు. దేశం ఇవ్వాళ ఒక డిజిటల్ పవర్, స్టార్టప్ పవర్, స్పేస్ పవర్. ఇవి మోడీ ట్రాక్ రికార్డ్.. కానీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? దోచుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్
ఉగ్రవాదులను కాపాడుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. మొదటిసారి ఓట్లు వేసే వారు ఒక్కసారి పదేండ్లలో మేమేం చేశామో తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్త ఓటర్లు పదేండ్ల క్రితం 10 ఏండ్లు ఉండి ఉంటారు.. వారికి ఏం జరిగిందో కూడా తెలియదు. గతంలో దిల్ సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందనే విషయంతెలుసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్లప్పుడూ ఇలాంటి న్యూస్ వినిపించేది. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి తిందామంటే బ్లాస్ట్ జరుగుతుంది, మూవీకి వెళ్లినా, బస్సులో ప్రయాణించినా బ్లాస్ట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఏమైనా బయటకు వచ్చిందా? మరి ఈ బాంటు బ్లాస్టులను మీ ఒక్క ఓటు ఆపింది. మోడీ సేవ దేశానికి అవసరమని కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కూటమికి నచ్చడం లేదు. అందుకే మోడీని రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయడమంటే.. మళ్లీ పాత రోజులు వచ్చినట్లే.. అందుకే దేశంలో ఉగ్రవాదులను ఎంటర్ కానివ్వొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలను అవమానించేలా మాట్లాడేవారు.
ఈసారి మేనిఫెస్టోలో మిడిల్ క్లాస్ ప్రజలకు కావాల్సి న ఎలాంటి అంశం లేదు. కానీ మిడిల్ క్లాస్ ప్రజల ఓటు బ్యాంకు కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. మీ ఆస్తిపై వారసులకు అధికారం లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మీ ఆస్తిని కూడా వారసులకు కాకుండా చేసే కాంగ్రెస్ అవసరమా?. కాంగ్రెస్ నరనరాల్లో రేసిజం అనే విషం నిండి ఉంది. అందుకే కాంగ్రెస్, ఇండియా కూటమితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ యువరాజుకు ఒక ఫిలాసఫర్ ట్యూషన్ చెప్పి కొన్ని ఐడియాలు ఇస్తున్నాడు. అయోధ్య రామమందిరం నిర్మాణం జరగొద్దని చెప్పాడు.. పూజలు కూడా నిర్వహించొద్దని యువరాజుకు చెప్పాడు. దేశాన్ని విదేశీ కండ్లద్దాల్లో చూసే కాంగ్రెస్ కు ఐడియా ఆఫ్ ఇండియా అనేదానిపై కనీసం అంచనా కూడా వేయలేదు. వెయ్యేండ్ల సంస్కృతి, సత్యమేవ జయతే, అహింస పరమోధర్మ:, బుద్ధం శరణం గచ్చామీ, గాడ్ ఈజ్ గ్రేట్.. ఇవన్నీ.. ఐడియా ఆఫ్ ఇండియా.
నాకు జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే ఎక్కువ ఇది ఐడియా ఆఫ్ ఇండియా. అధికారం కోసం కాంగ్రెస్, ఆ పార్టీ ఆలోచన విధానమున్న ఏ పార్టీ అయినా ఏమైనా చేస్తాయి. హైదరాబాద్ లో ఎంఐఎం గెలుపు కోసం స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ను కూడా నిలబెట్టలేదు. కేవలం ఓటు బ్యాంకు ఎక్కడ కోల్పోతామోననే భయంతో ఇతర పార్టీలు అలా చేస్తున్నాయి. కాంగ్రెస్.. తన ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల వరిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తోంది. కాంగ్రెస్ నేతలు ముస్లింలకు మొత్తం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు. లూటీ.. లూటీ.. లూటీ.. ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. ఒక ఆర్.. తెలంగాణలో మరొక ఆర్ ఢిల్లీలో ఉన్నారు.. ఇద్దరు కలిసి హైదరాబాద్ ను, తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారు. ఇక్కడ మరొక ఆర్ కూడా ఉంది.. అదే రజాకార్ ట్యాక్స్.. వీరు ఎలా వసూలు చేస్తారనేది పాతబస్తీలో తెలుస్తుంది. పాత బస్తీలో కనీస సౌకర్యాలు కూడా లేవు. గతంలో చిన్న వర్షానికే నీట మునుగుతోంది. వీటిని పరిష్కరించమంటే మాత్రం పరిష్కరించడంలేదు. పవర్ కట్ కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బీఆర్ఎస్ కు మీక ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లే.. కాంగ్రెస్ కు వేసే ఓటుతో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు.. అందుకే కమలం పువ్వు గర్తుకు ఓటేయండి.. హైదరాబాద్ తో పాటు ఇతర లోక్ సభ స్థానాల్లో పాత రికార్డులను బద్దలుచేస్తారా? లేదా?ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి లోక్ సభ సీట్ గెలుస్తుంది.. దాదాపు అన్ని పోలింగ్ బూత్ లో గెలిపించాలి’ అని నరేంద్ర మోడీ కోరారు.