రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు సంభవించింది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ భవన్ అటెండర్ పదవి ఇచ్చిన చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లలో పీసీసీ అవుతానని.. సీఎం కూడా అవుతానన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఢిల్లీలో కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏది చెప్తే జగ్గారెడ్డి అది ఫాలో అవుతారన్నారు.
నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. భూనిర్వాసితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ మొదలు పెట్టి పదేళ్లు పూర్తి పూర్తయిందన్నారు. నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో తెలియకుండానే కేసీఆర్ ప్రాజెక్టు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మారడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. చాలా జూనియర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1471 ప్రైవేటీ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 958 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు లభించింది.
Pranava Greenwich, Greenwich Villas, Pranava Greenwich Villas , Modern Villas, Hyderabad , Real Estate, Green Living , Hyderabad Real Estate, Telugu News
న్యాక్‌లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.