Allari Naresh: అల్లరి నరేష్‌తో నూతన చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
- అల్లరి నరేష్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నూతన చిత్రం
- విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో చిత్ర ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allari Naresh: కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న “మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు” అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్ తోనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సృజనాత్మక పోస్టర్ సినీ ప్రేమికులలో, అల్లరి నరేష్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు.
Read Also: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా కేవలం ప్రకటనతోనే అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. “ఫ్యామిలీ డ్రామా” చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.
అల్లరి నరేష్ యొక్క 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..