చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా శనివారం హామీ ఇచ్చారు. సిరిసిల్లలో పవర్లూమ్ రంగ సమస్యలపై చర్చించేందుకు పవర్లూమ్ యూనిట్ల యజమానులు, మాస్టర్ వీవర్లు, కార్మికులతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జౌళి పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికుల ఉపాధి, భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టర్ చర్చించారు. చర్య. వారితో ఇంటరాక్ట్ చేస్తూ కాటన్, పాలిస్టర్,…
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది.…
రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
భువనగిరి ఎంపి ఎన్నికలలో బిజేపి 32 శాతం ఓట్లు తెచ్చుకుందని, పార్లమెంట్ ఎన్నికలలో బిజేపి గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్యప్రచారాలతో ప్రజలను నమ్మించారన్నారు మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచి మంత్రులు పర్యటన పేరుతో కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు.…
కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాంచ్ న్యాయ పేరుతో చెప్పింది ఎంటి… ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు… వారితో రాజీనామా చేయిస్తే ఆ 26 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని, కొందరు గోతి కాడి నక్కల్ల ఎదురు…
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ఫౌండర్ (చైర్మైన్) మల్లారెడ్డి, రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవిణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…
హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల…
మేడిగడ్డ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటల వేలానికి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎండీసీఎల్) బిడ్లను ఆహ్వానించడంతో 383 బిడ్లు వచ్చాయి. 14 బ్లాకుల వేలానికి ఈ బిడ్లు వచ్చాయి. ఈ ఇసుక బ్లాక్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలో ఉన్నాయి. బిడ్లను పరిశీలించేందుకు టీజీఎండీసీఎల్ నుంచి ఐదుగురు అధికారులతో పాటు మైనింగ్, ఇరిగేషన్ శాఖల నుంచి ఒక్కొక్కరితో కమిటీని ఏర్పాటు చేసినట్లు వర్గాల సమాచారం. బిడ్డర్ల సాంకేతిక అర్హతల పరిశీలన…