బ్రిటిష్ పార్లమెంటరీ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) ఘోర పరాజయంతో అధికారానికి దూరమైంది. కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది, ఇది 2019లో గత ఎన్నికల కంటే 250 సీట్లు తక్కువ. పరాజయం తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు.
స్థానిక సంస్థలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, స్థానిక పాలన, పారిశుధ్యంపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్‌రావు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ విడుదల చేశారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన కార్యక్రమాలను హరీశ్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలలో చెత్త , మురుగు కాలువలను శుభ్రపరచడం, పర్యావరణ పరిశుభ్రత, అవెన్యూ ప్లాంటేషన్లు, మార్కెట్ల నిర్మాణం ,…
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం.. అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని…
ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల…
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు…
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎండీసీ) ఈ ఏడాది జూన్ వరకు రూ.6,461 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వినియోగదారులకు సరసమైన ధరకు సరిపడా ఇసుకను అందించాలనే లక్ష్యంతో 2014లో ఇసుక మైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇసుక అక్రమ రవాణా , లోడింగ్‌ను తగ్గించడం కూడా ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల TSMDCకి మాత్రమే కాకుండా స్థానిక…