Somireddy Chandramohan Reddy : చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఆంధ్ర.. తెలంగాణ ముఖ్యమంత్రులు ప్యాలెస్.. ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారని, కానీ చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సోమిరెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని ఆ రంగానికి ఏమీ చేయలేదని, మైక్రో ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
జగన్ ఒక నియంతలాగా వ్యవహరించారని, ఆయన హయాం కర్ఫ్యూ ని తలపించిందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో తిరుమల ను బ్రష్టు పట్టించారని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయ పవిత్రతను దెబ్బతీశారన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో కాకాని కారు పాస్ దొరికిందని, వైసీపీ హయాంలో రాష్ట్రం డ్రగ్స్..గంజాయి కి కేంద్రంగా మారిందని, కల్తీ మద్యం.. నకిలీ పత్రాలలో మాజీ మంత్రి కాకాణి నిందితుడన్నారు. గ్రావెల్.. మట్టి.. తెల్ల రాయి.. లలో అక్రమ రవాణాకు పాల్పడ్డారని, టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టించి హింసించారని సోమిరెడ్డి అన్నారు. కాకాణి అవకతవకలకు సహకరించిన అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.. ఇంకా అవుతారని, కాకాని అక్రమాలు..అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు సోమిరెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!