తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అవడం మంచి పరిణామమేనని, విభజన సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు ఈటల రాజేందర్. ఉద్యోగుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదని, రెండు రాష్ట్రాల కు అవసరం అయ్యే విదంగా చర్చలు జరిగాలన్నారు ఈటల. మేము ఉద్యమ సమయంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న…
ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడు మాసాలు పూర్తి అవుతుందని, ఇది చాలా పెద్ద సమయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, కానీ ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం.. బీఆర్ఎస్ పని అయిపోయిందని విన్యాసాలు చేస్తున్నారన్నారు. భారత పార్లమెంటు లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20శాతం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు కేవలం పది శాతానికి పరిమితం…
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై పార్టీ జాతీయాధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్‌కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది.
బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయ సంక్షోభం, ప్రజా సేవల కొరత, అక్రమ వలసలతో బ్రిటన్ పోరాడుతోంది. ఇదిలా ఉంటే లేబర్ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం.. పార్టీ భుజాలపై బాధ్యతల భారాన్ని పెంచింది. బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు.