శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈపై 78 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేయగా.. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్‌లో అత్యధికంగా కవిషా ఎగోడాగే (40*) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు సాధించింది. ఖుషీ శర్మ…
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద వస్తుంది. అయితే గోదావరి వరద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే శబరి నదికి కూడా భారీగా వరద రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్‌ఘడ్-ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శబరి నదికి 28 అడుగులకి వరద చేరుకుంది. దీంతో.. గోదావరికి పోటు ఏర్పడుతుంది. గోదావరి నుంచి దిగువకి వెళ్లే నీటి వేగం స్తంభించింది. దీంతో ఇప్పటికే…
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్‌లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ 'మా ప్రాణాలకు భరోసా ఏది' అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి…
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు…
ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.