ఏపీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అయితే.. విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో రెండు రోజులు విజయవాడలోనే సీఎం చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు…
జగన్ ముందుగా వరద పై పూర్తి వివరాలు తెలుసుకోవాలి భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక…
విజయవాడలో నీట మునిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే.. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసంది ప్రభుత్వం. అయితే.. ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే.. విజయవాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నుంచి ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక…
విజయవాడ సింగ్‌నగర్ లో కొందరు వ్యాపారులు, ప్రైవేటు మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు.. వాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరిపేట, పైపుల కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల నుంచి బోట్ల సాయంతో సింగ్ నగర్ కు వచ్చే బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్ళి భారీ మొత్తలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఆహార పదార్థాలను పంపిణీ…
గుంటూరు జిల్లా లోని ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధి గ్రామాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు పదివేల ఎకరాల్లో వరి నీట మునిగిందని అధికారులు గుర్తించారు. పొన్నూరు ఏ.డి.ఎ రామకోటేశ్వరి తో పాటు మండల వ్యవసాయ శాఖఅధికారిని కె కిరణ్మయి నీటి ముంపుకు గురైన ప్రత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్, ఎస్. ప్రతిభ శ్రీ, వి. మనోజ్ , డి. ఆర్ సి ఇన్చార్జి డి…
నవారో సంచలనం.. యుఎస్ ఓపెన్‌లో కొకో గాఫ్ కథ ముగిసే! యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర…
విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో విధ్వంసం కొనసాగుతోంది, రెండు రాష్ట్రాల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కురుస్తున్న వర్షం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది, రైలు ట్రాక్‌లు, రోడ్లు , విస్తారమైన వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి, దీని ఫలితంగా రైళ్ల రద్దు , మళ్లింపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రోజువారీ జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏజెన్సీలు…
నేడు కీలక కేసుల్లో తీర్పులు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. శాంతిస్తున్న కృష్ణమ్మ. క్రమంగా తగ్గుతున్న కృష్ణా నది వరద ఉదృతి. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి చేరకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గుతున్న నీటి మట్టం. నిన్న రాత్రి 9 గంటలకు 11.13 లక్షల వరద ప్రవాహం.…
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ యువకుడు తన మేనకోడలిని గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫరాజ్ నిరుద్యోగం కారణంగా మానసికంగా కుంగిపోయాడు. అంతేకాకుండా.. తనకు ఉద్యోగం లేదని కుటుంబ సభ్యులు ఎప్పుడూ తిడుతుండే వారు.