అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మంత్రి రామానాయుడు.
Devara Daavudi Song: బాధను భరిస్తూ అలా చేయడం గ్రేట్.. తారక్ పై రత్నవేలు ట్వీట్ వైరల్
సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నద్దే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి రామానాయుడు అన్నారు. గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతం చేసామని మంత్రి రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీ ల సహకారంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి రామానాయుడు అన్నారు.
Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు