దండకారణ్యంలో కీలక ప్రాంతమైన శ్రేయస్కరమైన ప్రాంతం కాదా అంటే అవుననే అనిపిస్తుంది వేల కిలోమీటర్ల మేరకు దండకారణ్యంతో పెద్దపెద్ద గుట్టలతో అందమైన సెలయేర్లతో నిండి ఉన్న ABOOJMAD లో ఇప్పుడు మావోయిస్టులకి రక్షణ లేకుండా పోయింది. తమకు రక్షణ కేంద్రాలను కున్న అటవీ ప్రాంతాలు పై భద్రతా బలగాలు రోజూ రోజు పట్టు సాధి స్తున్నాయి. ఇంద్రావతి నది సరిహద్దులో 31 మంది మావోయిస్టుల మృతి వెనక ఏమి జరిగింది .వారిని ఎలా ముట్టు పెట్టారు. ఎన్టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు ఇది..
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలని కలుపుతూ ఉన్న ప్రాంతం మావోయిస్టులకి పెట్టని కోట వంటిది. చుట్టూ సెలయేర్లు పెద్దపెద్ద గుట్టలు దట్టమైన కీకార్యం కాకులు దూరని కారడివి ఇది ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ABOOJMAD అటవీ ప్రాంతం. మావోయిస్టులకి ఒక కీలకమైన ప్రాంతం సుక్మా, దంతేవాడ, నారాయణపూర్ KAANKER, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్ మడ్ కొంత భాగం అంటే మరి కొంత భాగం దండకారణ్యంలో ఉంది .ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్న మావోయిస్టు లకి కీలకమైన ప్రాంతం ఈ అటవీ ప్రాంతం .దీనితో దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పాతతరం మావోయిస్టు నాయకత్వం కూడా ఇదే ప్రాంతంలోని ఉంది. ఇక్కడ నుంచే దేశవ్యాప్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇదే ప్రాంతంలో అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనే కాదు చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ ఎన్కౌంటర్లో మృతి చెందడం లేదా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . అంతటి మావోయిస్టులకే కీలకమైన ABOOJMAD ప్రాంతం నేడు భద్రతా బలగాల వశం అవుతుంది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ కూడా భద్రతా బలగాలె విజయం సాధిస్తుంది.
దట్టమైన అటవీ ప్రాంతం పెద్దపెద్ద గుట్టలు ,గుట్టల పక్కన సెలయేర్లు ఇవన్నీ కూడా ABOOJMAD ప్రత్యేకత. కాలు తీసి కాలు పెట్ట లేనటువంటి అటవీ ప్రాంతం ఇది. పోలీస్ యంత్రాంగం రావటానికి వీలు లేని ప్రదేశం కావడంతో ఇక్కడ నుంచే మావోయిస్టు కార్యక్రమాలు కొన సాగిస్తున్నారు. DANTHEWADA జిల్లా తూలి అనే ప్రదేశంలో 70 మంది మావోయిస్టు సమావేశం కావడంతో దానిమీద పోలీసు భద్రతా బలగాలు దాడి చేసి 31 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లాలంటే దాదాపుగా 20 కిలోమీటర్ల పైగా అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలా నడుచుకుంటూ భారీ ఎత్తున బలగాలు వెళ్లి ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. 1500 మంది భద్రతా బలగాలు దాడి చేశాయి.. ఇందులో మహిళ దళ కమాండర్ లు 500 మంది వరకు వున్నారు. బలగాల దాడిని ఇంద్రావతి దళం పసిగట్ట లేకపోయింది. ప్రధానంగా ఇంద్రావతి నది చుట్టూ అటు మహారాష్ట్ర ఇటు చత్తీస్ గడ్ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులదే పై చేయిగా ఉంటుంది. జీవ నదిని కేంద్రంగా చేసుకొని తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించి తప్పించుకోవడానికి అనుగుణంగా ఇంద్రావతి నది ఉపయోగపడుతుంది అందువల్లే ఇంద్రావతి నది చుట్టూ తమ దళాలని కీలకంగా పనిచేసే విధంగా మావోయిస్టు పార్టీ కేంద్రీకరణ చేసింది. అయితే భద్రత దళాల బలగాలు దాడిని మావోయిస్టులు పసిగట్టలేక పోయారు . గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో ఇన్ఫర్మేషన్. మావోయిస్టులు చేస్తున్న కార్యక్రమాలు వారు తీసుకుంటున్న రెస్ట్ ప్రదేశాలు భద్రత బలగాలకి లీక్ అవుతున్నాయి. దీంతో భద్రతా బలగాలకి ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని మావోయిస్టులపై దాడులు చేస్తూ సఫలీకృతం అవుతున్నారు. తాజాగా తూలి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందిన ఘటన సమీపంలో బలగాలకి మావోయిస్టుల సంబంధించిన పెద్ద పెద్ద ఆయుధాలు లభించాయి. ఇంత ఆయుధ సంపత్తి మావోయిస్టుల వద్ద ఉన్నదా అని పోలీస్ యంత్రాంగం ఆశ్చర్యపోతున్నది. అయినప్పటికీ ఈ ఆయుధ సంపత్తి భద్రతా బలగాల ని ఎదుర్కోవటంలో సక్సెస్ కాలేకపోయారు కారణం ఒకేసారి మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకొని పడటమే.
గత ఏడాదికాలంగా అంటే 2024 లో ఇప్పటివరకు మహారాష్ట్ర, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 200 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దక్షిణ భాస్కర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టులని టార్గెట్గా చేసుకొని భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయి. భద్రతా బ 200 మందికి పైగా మావోయిస్టులని కాల్చివేశారు. ఇవన్నీ మావోయిస్టు లు బలహీన పడటానికి కారణంగా మారుతుంది. తాజాగా మావోయిస్టుల పై భద్రతా బలగాలు పై చేయి సాధిస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు కోసం వేట స్పీడ్ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా రేపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని అమిత్ షా ఏర్పాటు చేశారు. మంచి ఊపు మీద ఉన్న బిజెపి ప్రభుత్వం మావోయిస్టులపై విజయాలు సాధిస్తూ ఇంకా ముందుకు వెళ్లే ఎందుకోసం దాడులను చేయాలని ప్రయత్నాలు చేస్తుంది . ఆ నేపథ్యంలోనే అమిత్ షా సమావేశం కూడా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంతులతో ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం అవుతుంది. మావోయిస్టులపై మరింత దూకుడుతో భద్రతా బలగాలు వెళ్ళనున్నాయి. మరో ABOOJMAD నే నమ్ముకున్న మావోలు మరో ప్రాంతాన్ని కి వలస వెళ్ళుతారా.. మరోవైపున ఇప్పటివరకు తమకు బలమైన కేంద్రంగా భావిస్తున్న మావోయిస్టులు వదిలిపెడతారా. లేక భద్రతా దళాలతో యుద్ధమే చేస్తారా చూడాల్సి ఉంది .