రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్ఫోన్ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్లెస్ హెడ్ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్సెట్ ఇచ్చారు. ఫోన్లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి వైద్య వృత్తి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు… ఎంతో అధ్యయనం చేశాను… ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్తాము అని చెప్పారని, మాకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. నేను సీఎంతో మాట్లాడి వెంటనే 200 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర…
బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది. ఎస్ జీ ఫిన్సర్వ్ని ముందుగా ముంగిపా సెక్యూరిటీస్ అని పిలిచేవారు. ఆర్బిఐ ఎప్పటికప్పుడు ఆర్థిక సంస్థల నిబంధనలను పాటించని అంశాలపై నిఘా ఉంచుతుంది. కంపెనీలు, బ్యాంకులు నిఘాలో ఉండేలా జరిమానాలు వంటి చర్యలను కూడా తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక…
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే.. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది.
లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ప్రభుత్వం పది నెలల పాటు అద్దె చెల్లించకపోవడంతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావుప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అగాధ స్థితికి చేరుకుందనడానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. హరీష్ రావుచేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్స్ వేదికపై కఠినమైన కౌంటర్ ఇచ్చారు. “గత పదేళ్ల మీ బీఆర్ఎస్…
ఏపీ సచివాలయంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్పై సీఐడీ కేసు నమోదు చేసింది.
దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ కుటుంబం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేకంగా గర్వకారణమైన నేవీ రాడార్ స్టేషన్ పై కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రాడార్ స్టేషన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జీవోలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అది ఎంత గొప్ప ప్రాజెక్టో, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒక విధంగా మాట్లాడినా, ప్రతిపక్షంలో…
సైదాబాద్ లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ బాల నేరస్తులుగా వచ్చినవారిలో పరివర్తన తీసుకొస్తున్నామన్నారు. ఇది శిక్ష కాలం కాదు శిక్షణ కాలమని ఆమె వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ అబ్జర్వేషన్ ఉన్నంతవరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలని, వాళ్లకి కావాల్సిన ఎడ్యుకేషన్, వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. టాటా టెక్నికల్ సపోర్ట్తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు మంత్రి…