ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా భీమవరంకు చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరించి రూ. 73 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.
ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది.
అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది.
విజయనగరం జిల్లా గుర్లలో తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధి ప్రబలటానికి (Acute Diarrheal Disease-ADD) దారితీసిన కారణాలు, భవిష్యత్తులో అట్టి పరిస్థితిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదికను అందజేసింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మంగళవారం సాయంత్రం మంత్రిత్వ శాఖకు నివేదికను అందచేసింది.
పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే.... తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్ లేక కేడర్ కూడా కన్ఫ్యూజ్లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది?