బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
అత్తాపూర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.. డబ్బు సంచుల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసమని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని దుయ్యబట్టారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అదనపు మెజిస్ట్రేట్గా మారారు. అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించారు. హిమాయత్ నగర్లో జరిగిన ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వివాదాన్ని విచారించారు.
పారిశ్రామిక ప్రమాదాల నివారణ సూచనలకు హైలెవెల్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్మాగారాలలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు చర్యలను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా నేతృత్వం వహిస్తారు.
వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలోని సంస్థ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్లు. కాగా.. అక్కడున్న స్థానికులు గమనించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో.. వారికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్లను ఓ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు.
గుర్ల డయేరియా విషయంలో ఏం జరుగుతుందని పరిశీలించమని అధికారులను ఆదేశించామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సెప్టెంబరు 14 నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంత మంది చనిపోయారనిది ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రాథమికంగా ఒక్కరు చనిపోయారని చెప్పారు.
నాలుగు గ్రీన్ఫీల్డ్ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు.
ఈరోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వెంకటేశ్వర్లను రెండు విడతలుగా విచారించింది కమిషన్. రేపు మళ్లీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లను కమిషన్ ఆదేశించింది. బహిరంగ విచారణలో వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి పేరును పలుసార్లు ప్రస్తావించారు.