జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. అప్పుడప్పుడూ వైద్యం వికటించొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది.