వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు. 9 ఏళ్ళలో ఏం చేశామో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, బహిరంగ చర్చకు ఏనీ టైం నేను సిద్దమన్నారు వినయ్ భాస్కర్. చిల్లర నాయకులు మీరు ఏం చేశారో చెప్పేందుకు చర్చకు రండీ అని ఆయన ఛాలెంజ్ చేశారు. జయశంకర్ ఉద్యానవనం ఏకశిలా పార్క్ లో కుక్కలు కొట్లాడుతున్నాయని ఓ నాయకుడు విమర్శలు చేస్తున్నారని, ఏకశిలా పార్క్ లో ఏ జరుగుతుందో చూద్దాం రండీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మౌనంగా ఉన్నామని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే చూస్తు ఊర్కోమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Peddi Sudarshan Reddy : రూ. 2.కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి
ప్రజలకు అందుబాటులో లేనివాళ్ళు పనికి మాలిన వాళ్ళే విమర్శలు చేస్తారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల వస్తున్నాయని చిల్లరమల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు. అభివృద్ధి నిరంతరం జరిగే ప్రక్రియ అని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు నెలల నాకోసం పని చేస్తే ఐదేళ్ళు నిస్వార్థంగా ఐదేళ్ళు మీకోసం పనిచేస్తానని ఆయన అన్నారు. ప్రతిరోజూ 16 గంటల పాటు ప్రజల కోసం కార్యకర్తల కోసం పని చేస్తానని ప్లీనరీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
Also Read : Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం