గోషామహల్ బీఅర్ఎస్ ఇంఛార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ, సమ్మేళన కార్యక్రమంలో మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంకా గులాబీ పార్టీ ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుంటే.. గోశామహల్ అభివృద్ధిలో వెనకబడిందన్నారు. గోశామహల్‌లో బీజేపీ గెలిచి ఇన్ని సంవత్సరాలైనా ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రం గోశామహల్ ను గాలికి వదిలేశారని ఆయన దుయ్యబట్టారు.
Also Ready : Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?
అంతేకాకుండా.. ‘గోశామహల్‌లో అభివృద్ధి జరగాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ముసలమ్మ నుండి పుట్టిన పసిపిల్లల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అనుగుణంగా పథకాలు ప్రవేశ పెట్టారు. గోశామహల్ లో గెలిచిన రాజాసింగ్ 9సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల సంక్షేమం గాలికి వదిలి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బేగంబజార్ లో ఎంతో మంది సంతోషంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ ప్రతిష్టంగా పనిచేస్తున్నది కాబట్టి శాంతిపూర్వకంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. గోశామహల్ లో నార్తిండియన్స్ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి బీఆర్‌ఎస్‌ను బలపర్చాలని కోరుతున్నాం.
Also Read : WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్
గోశామహల్ లో తమ ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాము చేపట్టాము అది మీకు తెలుసు.. గోశామహల్ నియోజకవర్గంలో ఎలాంటి వారైనా కడుతున్న బిల్డింగ్‌లపై డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఉరుకొము. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించి గోశామహల్ లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలి కోరుతున్నాము. అమిత్ షా కు కులలాలను, మతాలను విడగొట్టడం వారి ఎజెండా.
గోశామహల్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వచ్చిన గెలిపించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. తెలంగాణ లో ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం పనిచేస్తుంది. మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తాం. నా సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎలా చూసుకున్నానో.. గోశామహల్ ను అలానే చూసుకుంటా.’ అని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.